బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (18:26 IST)

అమెరికాకు రావొద్దనడానికి నువ్వెవరివి : ట్రంప్‌కు శ్రీనివాస్ తల్లి పార్వతి ప్రశ్న

ఓ జాత్యంహకారి జరిపిన తుపాకీ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా, అతని తల్లి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సూటిగా ఓ ప్రశ్న సంధించారు.

ఓ జాత్యంహకారి జరిపిన తుపాకీ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా, అతని తల్లి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సూటిగా ఓ ప్రశ్న సంధించారు. అమెరికా అనేది ఎన్నో దేశాల నుంచి వెళ్లిన ప్రజలతో కలగలసిన దేశమని, అందరూ కలిస్తేనే అమెరికా అని ఆమె చెప్పారు. అలాంటప్పుడు అమెరికా రావొద్దనడానికి నువ్వెవరంటూ ట్రంప్‌ను ఆమె నిలదీశారు. 
 
కన్నబిడ్డను కోల్పోయిన శ్రీనివాస్ తల్లి పార్వతివర్ధిని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తన కుమారుడు ఇకలేరనే వార్తను ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే డోనాల్డ్ ట్రంప్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
మనుషుల రంగు, జాతి చూసి మనుషులను నువ్వు చంపుతున్నావని, మరి వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావని ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. వాళ్లకు జన్మనిచ్చి, పెంచి ప్రయోజకులను చేసింది నువ్వు కాదని ట్రంప్‌పై ఆమె కోప్పడ్డారు. తన కోడలు ఆఫీస్‌కెళ్లిందని, ఆ సమయంలో బయటకు వెళ్లి కొంత సమయాన్ని గడపడమే నా కొడుకు చేసిన తప్పా అంటూ నిలదీశారు.