శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (09:31 IST)

పాము తలనే నోట్లో పెట్టుకునే మొనగాడు...

సాధారణంగా పామును చూస్తే ప్రాణభయంతో దౌడుతీస్తాం. పైగా, దాని వద్దకు వెళ్లాలన్నా.. పట్టుకోవాలన్నా భయంతో వణికిపోతారు. కానీ, అలాంటి విషసర్పాన్ని పట్టుకోవడమే కాదు.. దాంతో సరదాగా ఆడుకునేవారూ ఉన్నారు.

సాధారణంగా పామును చూస్తే ప్రాణభయంతో దౌడుతీస్తాం. పైగా, దాని వద్దకు వెళ్లాలన్నా.. పట్టుకోవాలన్నా భయంతో వణికిపోతారు. కానీ, అలాంటి విషసర్పాన్ని పట్టుకోవడమే కాదు.. దాంతో సరదాగా ఆడుకునేవారూ ఉన్నారు. అంతేకాదండోయ్.. ఆ విష సర్పం తలను ఏకంగా నోట్లో కూడా పెట్టుకుంటాడు. అతనిపేరు రామాంజనేయులు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం గ్రామవాసి. 
 
ఈ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా ఆయన్నే పిలుస్తారు. ఎంతటి విషపూరితమై పామునైనా అవలీలగా పట్టేస్తాడు. ఎంతటి పెద్దదైనా చేతిలో చుట్టేస్తాడు. ఆ తర్వాత దాంతో అతడు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. దానిని చేతిలో పట్టుకుని, అటూఇటూ తిప్పుతాడు. విషపూరితమైన దాని తలను ఏకంగా నోట్లోనే పెట్టుకుంటాడు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ 13 ఏళ్ల క్రితం కేరళకు చెందిన ఓ ముస్లిం గురువువద్ద పాములు పట్టే విద్య నేర్చుకున్నాను. పాముకాటుకు గురైన వారికి ఆయుర్వేద మందు తయారు చేసి, ఉచితంగా వైద్యం చేస్తాను. పాములు పట్టిన చోట తోచింది ఇస్తే.. దాంతో జీవనం సాగిస్తుంటాను. ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.