సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (11:15 IST)

తండ్రి కోడికూర వండిపెట్టమంటే.. కుమారుడు ఏం చేశాడో తెలుసా?

కోడికూర ఓ ప్రాణాలను బలిగొంది. తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడికూర కోసం తండ్రీకొడుకులు గొడవకు దిగారు. ఈ వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన సయ్యద్ మదార్ బండరాయి కొడుతూ బతుకు బండి నడుపుతున్నాడు.  ఆ పనిమీదే శంకరపట్నం మండల కొత్తగట్టులో నివాసం ఏర్పరుచుకున్నాడు. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ బండరాయి కొడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్ కుమారుడితో కోడికూర వండిపెట్టాలన్నాడు. కానీ తండ్రి పెడుతున్న వేధింపులను తాళలేక అతనిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు కుమారుడు. అనుకున్నట్లే నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోది హతమార్చాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు ఖాసీంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.