మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (16:50 IST)

అనూషను అందుకే హత్య చేశాడు: ఎస్పీ విశాల్

నరసరావుపేటలో సంచలనం సృష్టించిన అనూష హత్య కేసు వివరాలను రూరల్ ఎస్పీ విశాల్ వివరించారు. అనూషపై అనుమానంతోనే సహవిద్యార్థి విష్ణువర్థన్ హత్య చేసాడని తెలిపారు.
 
అనూష వేరే యువకుడితో చనువుగా వుంటోందనీ, తనను కాదని వేరే యువకుడితో తిరుగుతోందన్న అనుమానంతో ఆమెను ఈ నెల 24న నరసరావుపేట శివారుకు తీసుకెళ్లి అక్కడ గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై ఆగ్రహంతో గొంతు నులిమి హత్య చేసాడు. ఆ తర్వాత ఆమె ఆనవాళ్లను లేకుండా చేయాలని ప్రయత్నించాడు.
 
ఐతే స్థానికుల సమాచారంతో దొరికిపోయాడు. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేట్లు కోర్టును కోరుతామని ఆయన వెల్లడించారు.