గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (13:02 IST)

బలమైన ఆధారాలుంటే శిక్ష తప్పదు.. ఆ చర్యలు ఆ సెక్షన్ కిందికి రావు..

లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపించేందుకు బలమైన ఆధారాలు ఉండాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తెలిపింది. సెక్స్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసి, స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ ఉంటేనే లైంగిక దాడికి పాల్పడినట్లుగా భావించాలని కోర్టు తేల్చింది. కేవలం చేత్తో తడమడం, పట్టుకోవడం వంటివి లైంగిక దాడికి సమానం కాదని సింగిల్ జడ్జి బెంచ్ హైకోర్టు అభిప్రాయపడింది.
 
ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి శిక్షను తగ్గించాలనే అంశంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాలిక దుస్తులను బలవంతంగా తీసివేయడం, తన దుస్తుల్లోకి అసభ్యంగా చేతులు పెట్టడం వంటివి చేయకుండా, ఛాతీ భాగాన్ని తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని జస్టిస్ పుష్పా గణేడివాలా తెలిపారు.
 
లైంగిక వేధింపుల నేరానికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కానీ ఇందుకు బలమైన ఆధారాలు, ఆరోపణలు ఉండాలి. POCSO చట్టంలో లైంగిక వేధింపులను నిర్వచించారని న్యాయమూర్తి తెలిపారు. లైంగిక ఉద్దేశంతో దాడి చేయడం, పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం లేదా నిందితుల ప్రైవేట్ పార్ట్స్‌ను తాకాలని పిల్లలను బలవంతం చేయడం వంటివి లైంగిక దాడి, లైంగిక వేధింపుల కిందకు వస్తాయి.
 
సెక్స్‌ చేయనప్పటికీ, ఆ ఉద్దేశంతో ఫిజికల్ కాంటాక్ట్ ఉండే ఏ ఇతర చర్యలైనా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు బాలిక దుస్తులను తీసివేసినట్లు, ఆమె ఛాతీని అసభ్యంగా నొక్కినట్లు రుజువు కాలేదు. ఇక్కడ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ లేదని జస్టిస్ గణేడివాలా తన తీర్పులో చెప్పారు.