ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (08:34 IST)

నేటి నుంచి శ్రీశైలం ఆలయ దర్శనం బంద్

కరోనా ప్రభావం మరోమారు సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంపై పడింది. నేటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు.

ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.