శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (13:14 IST)

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న(ఆదివారం) శ్రీనివాసున్ని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే  10,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి  హుండీ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
గోవిందరాజస్వామి ఆలయంలో ఐనా మహల్‌
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రూ.66 లక్షలతో ఆధునికీకరించిన ఐనా (అద్దాల) మహల్‌ను ఆదివారం రాత్రి టీటీడీ ఈవో  జవహర్‌రెడ్డి ప్రారంభించారు. 

శాస్ర్తోక్త పూజలయ్యాక,  ఐనా మహల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు, పుండరీక వళ్లి అమ్మవార్ల ఉత్సవర్లకు ఊంజల్‌ సేవ నిర్వహించారు.