శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (12:29 IST)

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి దక్కిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది.

ఆత్రేయపురం ప్రధాన తపాలా కార్యాలయంలో విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు ప్రత్యేక తపాలా కవరును విడుదల చేశారు. ఈ కవర్‌ను రూ.20లకు పొందవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి.
 
సుమారు 300ఏళ్ల క్రితం ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కుటీర పరిశ్రమగా ఏర్పడింది. కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధిస్తూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తపాలాశాఖ కవర్ విడుదల చేసి మరోసారి గుర్తింపు ఇచ్చింది.