స్వీట్స్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? (video)
స్వీట్స్ అంటే చాలామందికి నోరు ఊరుతుంది. పంచదార లేదా బెల్లంతో చేసిన పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంతేకాదు.. బెల్లం, పంచదార, తేనే, చెరకు, అరటి, ద్రాక్ష, మామిడి, పనస, ఖర్జూరం వంటివి తీపి పదార్థాల కిందకే వస్తాయి. ఇవి శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం.
* పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది.
* ధాతువులకు పుష్టినిస్తుంది.
* విషానికి విరుగుడు.
* కేశ వృద్దినిస్తుంది.
* శరీరానికి తేజస్సు కలుగజేస్తుంది.
* పాలిచ్చే స్త్రీలకు స్తన్యవృద్ది చేస్తుంది.
* మన స్థైర్యం పొందుతారు.
* ఆయుఃప్రమాణం పెంచుతుంది.
* జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేటట్లు చేస్తుంది.
* దాహం తీరుస్తుంది. వేసవిలో చెరకు రసం, తీపి పానీయాలు దప్పిక తీరుస్తాయి.
* చర్మం, జుట్టు, మాంసము, రక్తము, మేధస్సు, ఎముకలు, మజ్జ, శుక్రము- దీని పరిధిలోకి వస్తాయి. ఆయా అవయవాలు పనితీరును క్రమబద్దం చేస్తుంది.
అధికంగా తీసుకుంటే?
కఫ దోషం పెరుగుతుంది. క్రొవ్వు ఎక్కువ అవుతుంది. స్థూల కాయం, డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధులు కలగవచ్చు.