మహిళలు బరువు తగ్గాలంటే.. ఇంటి పని చేస్తే సరిపోదు.. ఇది కూడా..?
మహిళలు బరువు తగ్గాలంటే.. ఇంటి పని, కార్యాలయ పనులు చేస్తూ గడిపేస్తే సరిపోదు.. కాస్త వ్యాయామం చేయాలి అంటున్నారు.. వైద్య నిపుణులు. బరువు తగ్గడం లేదా బరువు పెరగకుండా వుండాలంటే.. తీసుకునే ఆహారంలో ఎంత శ్రద్ధ పెట్టాలో.. అదే తరహాలో శారీరక శ్రమ కూడా దృష్టి పెట్టాలి. ఇందుకు వ్యాయామం రోజు వారీ ప్రణాళికలో వుండాలి. అప్పుడే మహిళలు బరువు తగ్గడం లేదంటే బరువు పెరగకుండా వుండటం సాధ్యమవుతుంది.
ప్రతీ రోజూ మహిళలు కనీసం గంట సేపైనా వ్యాయామం కోసం సమయం కేటాయించాలి. జిమ్, యోగా, వాకింగ్, జాగింగ్ వంటివి చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. బరువును తగ్గిస్తాయి. ఇంకా నీటిని అధిక మోతాదులో సేవించాలి. తద్వారా శరీరంలోని ట్యాక్సిన్లు వెలివేయబడతాయి. తద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఇంకా అవయవాలు ఆరోగ్యంగా వుంటాయి.
రోజూ పరగడుపున వేడి నీటిలో జీలకర్ర, నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. అందులో కాస్త తేనె కలుపుకుంటే ఇంకా బెటర్. ఈ రెమడీ శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు.. పంచదారను కాస్త పక్కనబెట్టాలి. స్వీట్స్ అధికంగా తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇకపోతే వ్యాయామం రోజూ వారీ ప్లాన్‌లో భాగం కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.