కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా?... ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు
కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులు కూడా ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి గణాంకాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కేంద్రం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని వారు అంటున్నారు.
నిధుల కోసం, గతంలో ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇస్తానన్న హామీలపై కేంద్రం రోజుకోమాట, పూటకో ప్రకటనగానే వ్యవహరిస్తోంది. ఆదాయం చాలక కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి కేంద్రం వైఖరి మరింతగా సమస్యలు సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ హామీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అనునిత్యం ఢిల్లీ అధికారులు, మంత్రులతో సంప్రదింపులు చేస్తూ నిధులు వచ్చేలా చూడాలని తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.