గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:06 IST)

ఏపీలో వేసవి సెలవులు.. మే 9నుంచి హాలీడేస్

school students
ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్స్ పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఇంకా జూనియర్ కాలేజీల విషయానికి వస్తే మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలీడేస్‌ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
 
ఏపీలో 1 నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదిలా ఉంటే జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.