మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:47 IST)

అసంతృప్తి టీకప్పులో తుఫాను లాంటిది.. పోలవరంను పూర్తి చేస్తా?

ambati rambabu
మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా  కొందరు నాయకుల్లో వున్న అసంతృప్తిపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 
 
నాయకుల్లో వున్న అసంతృప్తిని టీకప్పులో తుఫానుతో పోల్చారు అంబటి. రాష్ట్రానికి మణిహారం లాంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
 
పోలవరంతో పాటు రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని అంబటి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారి కల అని ఆయన అన్నారు.
 
మంత్రి పదవి కోల్పోయిన వారికి, ఆశించి రాని వారికి అసంతృప్తి అనేది ఉంటుందని అంబటి వ్యాఖ్యానించారు. అసంతృప్తిని వ్యక్తం చేయడంలో తప్పు చేస్తే మాత్రం ఎవరు క్షమించరని ఆయన అన్నారు. 
 
రాబోయే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సీఎం జగనే ఉంటారని రాంబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు రానివారికి రానున్న రోజుల్లో సీఎం జగన్ మంత్రి పదవులు ఇస్తారని చెప్పారు.