శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 28 నవంబరు 2017 (17:15 IST)

కుక్కకు సమాధి - వేలల్లో ఖర్చు.. ఎస్పీ బాగోతం...

సాటి మనిషిని ప్రేమించలేని మనస్తత్వాలు జంతువులపై విచిత్రంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నా ఒక పేదవాడి కంటే తమ పెంపుడు కుక్కకే విలువిచ్చే మనస్తత్వాలు ఎక్కువయ్యాయి. జంతువులు ప్రేమించడం తప్పు కాకపోయినా వాటి కోసం వేల రూపాయలు తగలేసిన వైనాన్ని

సాటి మనిషిని ప్రేమించలేని మనస్తత్వాలు జంతువులపై విచిత్రంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నా ఒక పేదవాడి కంటే తమ పెంపుడు కుక్కకే విలువిచ్చే మనస్తత్వాలు ఎక్కువయ్యాయి. జంతువులు ప్రేమించడం తప్పు కాకపోయినా వాటి కోసం వేల రూపాయలు తగలేసిన వైనాన్ని తప్పుబడుతున్నారు. అది కూడా పోలీసు వృత్తిలో ఉన్న వ్యక్తి తన పెంపుడు కుక్క పట్ల చాటుకున్న అమిత ప్రేమను చూసి ముక్కన వేలేసుకుంటున్నారు.  
 
అతని పేరు  రవికుమార్. తిరుపతిలోని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్‌లో ఎస్పీగా పనిచేస్తున్నాడు. పోలీసులకు కుక్కలంటే కామన్‌గానే అభిమానం ఉంటుంది. ఎందుకంటే విధి నిర్వహణలో పోలీసులకు కుక్కలు ఎంతో సాయంగా ఉంటాయి. అలాంటి పోలీసు కుక్కలపైన సదరు ఎస్పీ గారు ఎంత ప్రేమ చూపిస్తారో తెలియదు గాని టైంపాస్ కోసం తాను తెచ్చుకున్న పెంపుడు కుక్క కోసం అక్షరాల 80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. 
 
రవి కుమార్ గత కొంతకాలంగా ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా ప్రిన్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ కుక్క అనారోగ్యంతో చనిపోయింది. దాని చావును తట్టుకోలేకపోయారు. సదరు ఎస్పీ ఎంతో బాధపడ్డారు. అంతే కాకుండా మనుషులకు ఏవిధంగా కర్మ కాండలు నిర్వహిస్తారో... అదేవిధంగా స్మశానంలో పూడ్చి పెట్టి తమ కుక్కకు సమాధిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనుషులను ఘననం చేసే స్మశానవాటికలో కుక్కలను పూడ్చడాన్ని స్థానికులు వ్యతిరేకించినా ఎస్పీ గారు తన పలుకుబడిని ఉపయోగించి మరీ కుక్కకు సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. 
 
అంతటితో ఊరుకోకుండా ఏకంగా అందరికీ ఆ కుక్క పేరు మీద అన్నదానం కార్యక్రమం కూడా చేశారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందిపడుతున్న ఎంతోమంది ఉన్న ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన పెంపుడు కుక్క కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టిన రవికుమార్ తీరును తప్పు బడుతున్నారు చాలామంది.