ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (15:28 IST)

పబ్లిక్‌లో అమ్మాయితో ఆ పనిచేసి సారీ చెప్పిన హీరో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పోలీసులకు సారీ చెప్పారు. ముంబై రోడ్లపై ఈ బాలీవుడ్ హీరో చేసిన పనికి పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఆయన దిగివచ్చిన క్షమాపణలు చెప్పారు. ఇంతకీ వరుణ్ ధావన్ ఏం చేశారో తెలుసుకుం

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పోలీసులకు సారీ చెప్పారు. ముంబై రోడ్లపై ఈ బాలీవుడ్ హీరో చేసిన పనికి పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఆయన దిగివచ్చిన క్షమాపణలు చెప్పారు. ఇంతకీ వరుణ్ ధావన్ ఏం చేశారో తెలుసుకుందాం?
 
తాజాగా వరుణ్ ముంబై రోడ్లపై తన కారులో ప్రయాణిస్తుండగా, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగింది. ఆసమయంలో ఆయన కారు పక్కన ఓ ఆటో ఆగింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతి.. వరుణ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయింది. ఆయన సెల్ఫీ కావాలంటూ ప్రాధేయపడింది. దీంతో ఆ హీరో ఫ్యాన్ మాట కాదనలేకపోయారు. వెంటనే కారులో నుంచే సెల్ఫీ తీశారు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఇది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అమర్చిన సీసీటీవీలో నమోదైంది. వెంటనే ముంబై పోలీసులు ఆ ఫోటోను జతచేసి ఓ ట్వీట్ చేశారు. "ఈ తరహా అడ్వంచర్లు సిల్వర్ స్క్రీన్‌పై అయితే బాగా పని చేస్తాయి కానీ ముంబై రోడ్లపై కాదు. నీ లైఫ్‌ని రిస్క్ చేయడమేకాకుండా.. మరికొందరి లైఫ్స్‌ని కూడా రిస్క్‌లో పెట్టావు. నీవంటి యూత్ ఐకాన్‌ నుంచి ఓ మంచి విధేయతను ఆశిస్తున్నాం. ఈ-చలాన్ మీ ఇంటికి వెళుతోంది. మరోసారి ఇలా జరిగితే మేము కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది" అంట వరుణ్‌కు ముంబై పోలీసులు ఓ స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు. 
 
దీనికి వరుణ్ స్పందించారు. "నా క్షమాపణలు.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు మా కార్లు కదలవు.. ఓ అభిమాని సెంటిమెంట్‌ను కాదనలేకపోయాను కానీ ఈ సారి సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను" అంటూ రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం అంతటితో సద్దుమణిగిపోయింది.