శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (15:11 IST)

వరుణ్ ధావన్‌కు చుక్కలు చూపించిన యువతి

బాలీవుడ్ యంగ్ నటుడు వరుణ్ ధావన్‌కు ఓ యువతి చుక్కలు చూపించింది. ప్రతిరోజూ ఆమెకు మెసేజ్‌లు ఇవ్వాలని వేధించింది. పద్దతి మార్చుకోమని హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. వేరే నెంబర్ నుంచి ఆత్మహత్య చేసుకుంటానని

బాలీవుడ్ యంగ్ నటుడు వరుణ్ ధావన్‌కు ఓ యువతి చుక్కలు చూపించింది. ప్రతిరోజూ ఆమెకు మెసేజ్‌లు ఇవ్వాలని వేధించింది. పద్దతి మార్చుకోమని హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. వేరే నెంబర్ నుంచి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. యువతి వేధింపులు తాళలేక చివరికి వరుణ్ ధావన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ యువతి వరుణ్‌ ధావన్ ఫోన్ నెంబర్ కనుక్కొని.. రోజూ మెసేజ్‌లు పెట్టేది. ఆమె మెసేజ్‌లకు మొదట్లో స్పందించిన వరుణ్.. ఆమె హద్దులు దాటుతుండడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. 
 
అయినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆమె ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేశాడు. ఆ తరువాత మరోవ్యక్తి ఫోన్ చేసి, ఆమె మెసేజ్‌లకు సమాధానం ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటుందని హెచ్చరించాడు. ఇక ఆలస్యం చేస్తే ప్రమాదకరమని భావించిన వరుణ్ ధావన్ శాంతాక్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువతిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.