1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (09:43 IST)

ఇకపై చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.. సుప్రీం

Babu
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఇకపై రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొనే అవకాశాన్ని సుప్రీం కోర్టు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని చంద్రబాబుకు సూచించింది. 
 
స్కిల్ కేసుపై ప్రభుత్వం తరపున కూడా ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. 
 
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని తెలిపింది. 
 
డిసెంబర్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.