సంబంధిత వార్తలు
- సినిమాలను పక్కన బెట్టేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికలపైనే దృష్టి!?
- చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై విచారణ పూర్తి.. 31న తీర్పు
- తెలంగాణ ఎన్నికలు 2023: వైఎస్ షర్మిల కోసం సిద్ధాంతిని కలిసిన విజయమ్మ!
- నెల్లూరులో జనసేన పార్టీకి షాక్.. కేతంరడ్డి వినోద్ రెడ్డి రాజీనామా
- వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్: బాల్య వివాహాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఒక బ్లూప్రింట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. గత నెల 30వ తేదీన బాన్సువాడ వేదికగా ప్రజాశీర్వాద సభ జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
స్టార్ కాంపెయినర్‌గా బాధ్యతాయుతమైనపదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొంది.
కాగా దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా, స్టానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14వ ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.
తర్వాతి కథనం
