గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:57 IST)

బట్టలు దొంగతనం చేసిన ఏఎస్ఐ మృతి... ఎలా?

ఇటీవల జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో ఓ వస్త్ర దుకారణంలో బట్టలు దొంగతనం చేసి అరెస్టు అయిన ఏఎస్ఐ మృతి చెందారు. జైల్లో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 
 
ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మరో కానిస్టేబుల్‌తో పాటు ఏఎస్ఐ మహమ్మద్ పట్టుబడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 
 
అయితే, బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మహమ్మద్ మృతి చెందారు.