సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (08:36 IST)

సాయిబాబా ఓ భూతం.. దేవుడు కాదు.. బదరీ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద

బదరీ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహాస్వామి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్డీ సాయి ఓ భూతమని, ఆయన ఆసలు దేవుడే కాదంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ లలితకళాతో

బదరీ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహాస్వామి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్డీ సాయి ఓ భూతమని, ఆయన ఆసలు దేవుడే కాదంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ లలితకళాతోరణంలో దర్శనం పత్రిక పుష్కరోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్వరూపానంద సరస్వతీ మహాస్వామి ప్రసంగిస్తూ... 'తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా సాయి అనే భూతాన్ని పూజిస్తున్నారు. షిర్డిసాయి భూమిపై పుట్టారే తప్ప అవతరించిన వారు కాదు. సాయిని దేవుడిని చేసి హిందువులను మూర్ఖులను చేయకండి. సాయిని దత్తాత్రేయ, కృష్ణుడు, రాముడు, విష్ణువు రూపాల్లో కొలుస్తున్నారు ఇది తప్పు. సీతారాం బదులు సాయిరాం అని ఎందుకు అంటున్నారో వారే ఆలోచించుకోవాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
సంతోషిమాత వచ్చింది.. వినాయకుడు పాలు తాగాడు అంటూ సనాతన ధర్మం పరువు తీయవద్దన్నారు. జిహాద్‌ పేరిట పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు దేశమంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఎదుటి వారి ఆకలిని తీర్చి, ప్రతిప్రాణిలో పరమాత్మను చూసేవాడే హిందువు అని అన్నారు. హిందూదేశంలో పుట్టిన వారందరూ హిందువులని కొత్త వ్యాఖ్యలు వస్తున్నాయని, అవి అవాస్తవమని అన్నారు. వేదాలను పఠించి, గోమాతను పూజించి, గోదావరి, కృష్ణలను పూజించేవారే హిందువులని అన్నారు. 
 
భారతదేశంలో మహిళలను పూజించే సంస్కృతి ఉండేదని, అయితే ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం మద్యం సేవించడమేనన్నారు. ఉగ్రవాదంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయని, దీనిని దేశమంతా ఒక్కటై ఎదుర్కోవాలని సూచించారు.