ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జూన్ 2024 (12:59 IST)

ముగిసిన ప్రమాణ స్వీకారోత్సవం.. కొలువుదీరిన మంత్రులు వీరే

Babu-Modi-Pawan
ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలోని మేధా ఐటీ టవర్స్ దగ్గర అంగరంగ వైభవంగా ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు.
 
ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి... వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం... ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. 
 
జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. 
 
టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 
 
కాగా, ఈ క్యాబినెట్ లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో ముగ్గురు మహిళలు. 8 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక వైశ్య సామాజికవర్గ నేతకు క్యాబినెట్ లో అవకాశం కల్పించారు.