గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (18:12 IST)

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల మృతి

తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ వాసులుగా గుర్తించారు. 
 
పుదుక్కోట రహదారిపై 16 మందితో అయ్యప్ప భక్తులతో వస్తున్న కారును కంటైనరుతో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతులంతా మెదక్ జిల్లా నర్సాపూర్‌ వాసులుగా గుర్తించారు. మృతులను నాగరాజు, మహేశ్, శ్యామ్, ప్రవీణ్, సాయి, ఆంజనేయులు, సురేశ్, కృష్ణగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను తిరుమయం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.