సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:40 IST)

15 ఏళ్ల బాలికపై వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అఘాయిత్యం.. మాయమాటలు చెప్పి?

15 ఏళ్ల బాలికపై ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మాదాపూరులో చోటుచేసుకుంది. స్నేహంగా మెలిగి ఆ బాలికకు దగ్గరై  ఆమెపై లైంగికి దాడికి పాల్పడ్డాడు.. ఆ దుండగుడు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లో ఉద్యోగం కోసం వచ్చిన ఓ కుటుంబం అక్కడే స్థిరపడింది. ఆ కుటుంబానికి చెందిన 15ఏళ్ల బాలిక మంచినీటి కోసం సమీపంలోని వాటర్ ట్యాంకర్ వద్దకు తరుచూ వెళ్లేది.
 
అలా వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రవి(24)తో పరిచయమైంది. ఇటీవల బాలిక ఓరోజు నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లగా.. మాయ మాటలతో రవి ఆమెను తనతో పాటు ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.