ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (14:44 IST)

మైనర్ బాలికపై లైంగిక దాడి-ఫోటోలు, వీడియోలు లీక్.. వేటు

గోవా చీఫ్ కోచ్ సురజిత్ ఓ మైనర్ బాలికతో లైంగికదాడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు వెలుగుచూశాయి. కొందరు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ సుమోటోగా స్పందించింది. స్విమ్మింగ్ కోచ్ ప్రవర్తనను సీరియస్‌గా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐను ఆదేశించారు. 
 
కేంద్రమంత్రి ఆదేశాలతో రాష్ట్ర విభాగం కమిటీ వేసింది. సురజిత్ లైంగికదాడి నిజమేనని కమిటీ తేల్చడంతో.. చీఫ్ కోచ్ పదవీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు సురజిత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్రమంత్రి రిజిజు ఆదేశించారు.
 
ఇంకా సురజిత్ గోవా స్విమ్మింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి కాదన్నారు. కానీ దీనిని తీవ్రంగా పరిగణించామని పేర్కొన్నారు. అతనితో గోవా ఎస్ఎఫ్ఐకు ఉన్న కాంట్రాక్టును కూడా రద్దు చేసినట్టు వెల్లడించారు. దేశంలోని మిగతా స్విమ్మింగ్ ఫేడరేషన్‌లో కూడా సురజిత్‌ను తీసుకోవద్దని స్పష్టంచేశారు.