బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:50 IST)

మేకపాటి గౌతంరెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. సోమవారం ఆయనకు గుండెపోటురావడంతో ఆగమేఘాలపై హైదరాబాద్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అభిమానులు, రాజకీయ నేతల సందర్శనార్థం ఉంచుతారు. 
 
దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి గౌతంరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గౌతం రెడ్డి మృతి తనను కలిచివేసిందని, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మృతి బాధాకరమని ఆయన చెప్పారు. అలాగే, గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.