ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:22 IST)

లతా మంగేష్కర్ మృతి పట్ల నాట్స్ సంతాపం

ఎడిసన్, న్యూ జెర్సీ:  భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది. భారతీయ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణం అమెరికాలోని తెలుగువారితో పాటు యావత్ ప్రవాస భారతీయులందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ఓ ప్రకటనలో తెలిపారు.

లతా పాటలు వింటూ తామంతా పెరిగామని అరుణ అన్నారు. లతాజీ హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగి వస్తారని ఆశించామని.. కానీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరిని కలిచివేసిందని నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే పేర్కొన్నారు. లతా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నాట్స్ తెలిపింది. ఆమె కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది.