శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:58 IST)

చంద్రబాబు భద్రతపై ఇదేం లెక్క?: ఇచ్చేది 58 మంది.. చెప్పేది 183

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భద్రతపై డీజీపీ కార్యాలయం ఇచ్చిన సమాచారాన్ని పార్టీ తప్పుబట్టింది. 58 మంది భద్రతో కల్పిస్తూ.. 183 మంది అని అవాస్తవాలు చెప్పడమేంటని ప్రశ్నించింది.

తెదేపా అధినేత చంద్రబాబు భద్రతపై డీజీపీ కార్యాలయం తప్పుడు సమాచారం ఇచ్చిందని టీడీపీ ఆరోపించింది. 58 మందితో భద్రత కల్పిస్తూ 183 మంది అని అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చంద్రబాబు భద్రతపై పోలీసు శాఖ మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉన్నాయని ఆక్షేపించింది. అందుకు సంబంధించి కేవలం 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తూ పోలీసుశాఖ రాసిన అధికారిక లేఖను విడుదల చేసింది.

కీలక నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించిన టీడీపీ
ఏపీలో తెలుగుదేశం బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కీలకంగా ఉన్న పలు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.

జిల్లా మరియు నియోజకవర్గ నాయకులతో సంప్రదించి, స్థానిక కార్యకర్తలతో అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని నియామకాలను చేపట్టడం జరిగింది టీడీపీ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా.. మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఇంఛార్జుల నియామకం ప్రక్రియ పూర్తి చేయడం జరగుతుందని ప్రకటనలో తెలిపింది.

వీరంతా నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుందని టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.