ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (13:43 IST)

కొడాలి నాని, ద్వారంపూడిలపై పట్టాభి ఫైర్-పందికొక్కుల్లా తింటున్నారు

వైకాపా నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైకాపా నేతలు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభి ఫైర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారని ఆరోపించారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు పక్కదారి పట్టిస్తూ పందికొక్కుల్లా తింటున్నారు.
 
ఏటా రూ.5 వేల కోట్ల విలువైన పేదల బియ్యాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు పట్టాభి. దొంగ బియ్యం వ్యాపారంలో మంత్రి కొడాలి నానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి భాగస్వామి అని విమర్శలు గుప్పించారు.