బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (16:30 IST)

నా తండ్రి కేశినేని పట్ల టీడీపీ నేతలు అవమానకరంగా ప్రవర్తించారు: శ్వేత

kesineni swetha
తమ తండ్రి, విజయవాడ ఎంపీ కేశినేని నాని పట్ల టీడీపీ నేతలు అవమానకరంగా నడుచుకున్నారని ఆ పార్టీకి చెందిన విజయవాడ మున్సిపల్ కార్పొటర్ కేశినేని శ్వేత ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకోండని తన తండ్రికి ముందే చెప్పివుంటే బాగుండేదన్న ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేస్తారని తెలిపారు. కేశినేని చిన్నికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదని అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 
 
విజయవాడ ఎంపీ టిక్కెట్ గురించి తమను పిలిపించుకుని మాట్లాడి ఉంటే బాగుండేదని, తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం బాధాకరమని చెప్పారు. ఎంపీ పోటీ నుంచి మీరు తప్పుకోండని తన తండ్రికి సూచించిన ఉంటే బాగుండేదని అన్నారు. అలా కాకుండా అభ్యర్థిని మార్చాలని ముందే నిర్ణయం తీసుకుని, చివరకు తమకు చెప్పారని తెలిపారు. 
 
విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేయడం ఖాయమని, అది స్వతంత్ర అభ్యర్థిగానా లేక మరో పార్టీ నుంచా అనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది తన తండ్రి ఇంకా నిర్ణయించలేదని, అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఉన్నారు. గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, నరసారావు పేట లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థులు కూడా లేరని ఆమె వ్యాఖ్యానించారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం మానేసి... విజయవాడ మీద పడ్డారని విమర్శించారు.