బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (14:08 IST)

కార్పొరేటర్ పదవికి.. టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని శ్వేత

kesineni swetha
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్‌కు వెళ్లి అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 
 
అంతకుముందు ఆమె విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూబ, వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తన నిర్ణయాన్ని ముందుగా ఎమ్మెల్యేకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. పైగా, గద్దె రామ్మోహన్ రావు తమ కుటుంబ స్నేహితుడని తెలిపారు. 
 
అక్కడ నుంచి ఆమె నేరుగా విజయవాడ కార్పొరేషన్ కార్యాలయాని చేరుకుని తన రాజీనామా లేఖన ు మేయరకు అందజేశారు. కాగా, తన కుమార్తె రాజీనామా చేయనున్నారనే విషయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ముందుగానే ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెల్సిందే. అలాగే, తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు.