విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు.. పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటూ పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో వుండటం సరైందని తన అభిప్రాయమని తెలిపారు.
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్ గారిని కలసి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింప చేయించుకుని.. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని ప్రకటించారు.