జగన్‌కు ఆదినారాయణ బంపర్ ఆఫర్.. వైకాపాను టీడీపీలో విలీనం చేస్తే పోలా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైకాపా నుంచి జంప్ అయి.. టీడీపీలో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు జగన్ మద్దతు పలకడంపై ఆదినారాయణ ఎద్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైకాపా నుంచి జంప్ అయి.. టీడీపీలో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు జగన్ మద్దతు పలకడంపై ఆదినారాయణ ఎద్దేవా చేశారు. జగన్ తన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి గోడదూకిన సుజయ, ఆదినారాయణ, అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డిలు మంత్రులైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వీరిలో ఒకరైన ఆదినారాయణ రెడ్డి జగన్‌పై సెటైర్లు విసిరారు. 2014 మే 16న కౌంటింగ్ తర్వాత ప్రధాన మోడీని, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను జగన్ కలవడాన్ని తాను అప్పుడే వ్యతిరేకించానన్నారు. ప్రత్యేక హోదా కోసం వచ్చే నెలలో తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో జగన్ రాజీపడ్డారని, ఆన ఓ కలుపుమొక్క అన్నారు. అలాంటి జగన్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.