బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (16:56 IST)

కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు.. మార్చికి వాయిదా

Krishna
Krishna
కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ వెల్లడించింది. కృష్ణా జలాల నీటిని రెండు రాష్ట్రాలు వాస్తవంగా వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. 
 
ప్రస్తుతం నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించి రెండు రాష్ట్రాల వాస్తవ నీటి వినియోగాన్ని నిర్ణయించాలని తెలంగాణ సర్కారు కేఆర్ఎంబీని కోరింది. ఇందులో భాగంగా శుక్రవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇన్ చీఫ్ మురళీధర్ ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా ప్రతి ఒక్కరూ వాస్తవంగా ఎంత నీటిని ఉపయోగించారు. 
 
నీటి వినియోగంలో తెలంగాణకు సరైన వాటా రావట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రస్తుత సంవత్సరంలో ఏపీ ఇప్పటికే  తన కోటా కంటే ఎక్కువగా కృష్ణానీటిని వినియోగించుకుందని ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.
 
తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం వుండగా, తెలంగాణ వాదనల అనంతరం ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి విచారణ మార్చిలో జరిగే అవకాశం వుందని కమిటీ సభ్యులు తెలిపారు.