సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : ఆదివారం, 24 జనవరి 2021 (18:48 IST)

కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం: తెలంగాణా గవర్నర్

కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు దేశప్రజలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్. తిరుమల, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా తమిళనాడు గవర్నర్ దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు గవర్నర్ కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
ఆలయం లోపల మండపంలో పద్మావతి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటగా మన దేశంలో వ్యాక్సిన్ టీకా ప్రక్రియ కొనసాగుతుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా టీకాను ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు గవర్నర్.
 
ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన నరేంద్ర మోడీకి, డాక్టర్స్‌, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు గవర్నర్. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు.