అనుమానంతో ఇనుపరాడ్‌తో బాది చంపేశాడు...

murder
Last Updated: బుధవారం, 13 మార్చి 2019 (16:58 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో అనుమానంతో భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశాడో కసాయి భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూపీకే రామయ్యకాలనీలో రాములు ఆటో నడుపుకుంటూ రమాదేవి(30), కూతురు అనూషతో కలిసి జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆమెను అనుమానిస్తూ శారీరకంగా హింసకు గురిచేస్తున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాములు భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై కొట్టి గాయపరిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా గాయపడి ఉండటాన్ని చూశాడు.

దీంతో భయపడిపోయిన రాములు అక్క గాయపడిన రమాదేవి తలకు గుడ్డ ముక్కను అదిమిపట్టి గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి సోదరుడు దేదావత్‌ లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేశారు.దీనిపై మరింత చదవండి :