శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (11:18 IST)

తాతకు ప్రేమతో కోవెల.. గుడికట్టి పూజిస్తున్న మనవడు... ఎక్కడ?

బయట నుంచి చూసేందుకు అది అచ్చం ఆలయంగా ఉంటుంది. ఆలయంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకుందామని భావించిన భక్తుడు ఎవరైనా లోపలకు వెళితో షాక్‌కు గురికావాల్సిందే. ఆలయం లోపల దేవుడిది కాదు కదా.. అక్కడ విగ్రహాలేవీ ఉండవు. ఓ పెద్దాయన చిత్రపటం ఉంటుంది. అదేంటనుకుంటున్నారా... తల్లితండ్రులకు, భార్యకు గుడి కట్టించిన ప్రేమమూర్తుల కథలు గతంలో విన్నాం. ఇదీ అలాంటిదే. 
 
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం నావల్గ గ్రామానికి చెందిన మొగులప్పకు సంతానం లేకపోవడంతో తన తమ్ముడి మనవడైన ఈశ్వర్‌ను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. దత్తత వల్ల తండ్రైనా.. వరసకు పెదతాత అయిన మొగులప్పను ఈశ్వర్‌ ఎప్పుడూ తాత అనే ప్రేమతో పిలిచేవారు. 
 
2013లో మొగులప్ప మృతిచెందడంతో ఈశ్వర్‌ ఆవేదనకు గురయ్యారు. తాతను చిరస్థాయిగా ఆరాధించుకునేందుకు తన సొంత భూమిలో రూ.24 లక్షలు వెచ్చించి భవ్య ఆలయం నిర్మించారు. వ్యవసాయదారుడైన ఈశ్వర్‌ దినచర్యలో తాతకు పూజ చేయడం భాగం. ఏటా మొగులప్ప వర్ధంతి రోజున ఆరాధనోత్సవాలు కూడా నిర్వించి అన్నాదానం చేస్తుంటారు.