గిరిజన మైనర్ బాలికపై ఆర్ఎంపీ వైద్యుడి అఘాయిత్యం

rape girl
ఎం| Last Updated: సోమవారం, 2 డిశెంబరు 2019 (16:08 IST)
రాష్ట్రంలో ఓ గిరిజన మైనర్ విద్యార్థినిపై ఆర్ఎంపీ వైద్యుడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ జులైవాడ ఎస్టీ హాస్టలులో 14 యేళ్ల బాలిక చదువుకుంటూ అక్కడే నివశిస్తోంది. ఈ విద్యార్థినికి కళ్ళలో నీరుకారుతుంటే స్థానిక ఆర్ఏంపీ వైద్యుడు రాజు వద్దకు సాటి విద్యార్థులు తీసుకెళ్లారు.

బాలికను పరీక్షించిన వైద్యుడు రాజు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు వదిలిన అనంతరం విషయాన్ని గ్రహించిన సదరు విద్యార్థిని ఏడ్చుకుంటూ హాస్టల్‌కెళ్లి ఫోనులో తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. మలుగులో ఉన్న తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఆర్ఎంపీ వైద్యుడుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :