వెటర్నరీ డాక్టర్‌ను పెట్రోల్ పోసి ఎందుకు తగలబెట్టారు..? (video)

ఎం| Last Updated: గురువారం, 28 నవంబరు 2019 (17:45 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి శివారులో జరిగిన యువతి హత్య కేసులో శంషాబాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఘటనాస్థలానికి శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి షాద్ నగర్ ఏసీపీ సురేందర్ చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో శంషాబాద్‌కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే వీరిది సొంత గ్రామం కొల్లాపూర్ నర్సాయపల్లి. అయితే స్థిరపడింది మాత్రం శంషాబాద్‌లో.

మృతి చెందిన యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎందుకు ఆ యువతిని పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకుంటామని తెలిపారు.
దీనిపై మరింత చదవండి :