ఏయ్.. బాకీ డబ్బులకు బదులు నా కోర్కె తీర్చరాదూ! : వివాహితపై లైంగిక వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో ఓ వడ్డీ వ్యాపారి ఓ వివాహితను టార్చర్ పెట్టాడు. బాకీ తీర్చలేకుంటే తన కోర్కె తీర్చాలంటూ వేధించాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ పంచాయతీ పరిధిలోని ద

sadist
pnr| Last Updated: ఆదివారం, 11 జూన్ 2017 (12:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో ఓ వడ్డీ వ్యాపారి ఓ వివాహితను టార్చర్ పెట్టాడు. బాకీ తీర్చలేకుంటే తన కోర్కె తీర్చాలంటూ వేధించాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ పంచాయతీ పరిధిలోని దమ్మక్కపల్లిలో చోటుచేసుకుంది.

దమ్మక్కపల్లికి చెందిన వివాహిత (25), ఆమె భర్త రెండేళ్ల క్రితం చిల్ల సత్యయ్య అనే వ్యక్తి నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు. ఈ దంపతులు బాకీ తీర్చకపోవడంతో సత్తయ్య పంచాయితీ పెట్టాడు. బాకీ చెల్లింపునకు పెద్దలు కొంత గడువిచ్చారు.

ఈ క్రమంలో శుక్రవారం వివాహితను సత్తయ్య అడ్డగించి.. బాకీ డబ్బుల కింద తన కోరిక తీర్చాలని వేధించాడు. లేదంటే ఆమెను, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. ఈమేరకు సత్తయ్యపై భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీనిపై మరింత చదవండి :