ఏపిలో విమానరాకపోకలపై తెలుగులో కూడా ప్రకటనలుః అశోక్ గజపతిరాజు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విమానాశ్రాయాల్లో విమానాల రాకపోకలపై తెలుగు భాషలో కూడా ప్రకటనలు(అనౌన్స్‌మెంట్లు) చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు పి.అశోక్ గజపతిరాజు తెలియజేశారు.

ప్రాచీన భాష హోదా కలిగిన తెలుగు భాషను రాష్ట్రంలో మరింత విస్తృత స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా తెలుగు ప్రయాణీకుల సౌకర్యార్ధం విమానాశ్రయాల్లో హిందీ, ఆంగ్ల భాషలతో పాటు తెలుగులో కూడా విమానాల రాకపోకలపై అనౌంన్స్‌మెంట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు విజ్ఞప్తి చేస్తూ లేఖ వ్రాయడం జరిగింది.
ఆలేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ఇకపై రాష్ట్రంలోని విశాపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కడప విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై హిందీ, ఆంగ్లంతోపాటు తెలుగు భాషలో కూడా ప్రకటనలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.