శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (20:15 IST)

రాత్రంతా ఒకటే చాటింగ్- భార్య ఫిర్యాదు.. నటుడు సామ్రాట్‌ అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇంటికొచ్చినా చాలామంది కుటుంబాన్ని, భార్యను పట్టించుకోకుండా చాటింగ్‌లో మునిగిపోతున్నారు. ఇలా ఓ భర్త రాత్రంతా చాటింగ్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇంటికొచ్చినా చాలామంది కుటుంబాన్ని, భార్యను పట్టించుకోకుండా చాటింగ్‌లో మునిగిపోతున్నారు. ఇలా ఓ భర్త రాత్రంతా చాటింగ్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనెవరో కాదు.. టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి.

భార్య ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. గతంలో భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని సామ్రాట్ రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి ఇంట్లోనే దొంగతనం చేశాడని.. రాత్రంతా చాటింగ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా భార్య అతనిపై వరకట్నం కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498/ఏ కింద ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తాజాగా దొంగతనం కేసు పెట్టడం గమనార్హం.
 
ఇక దొంగతనం కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సామ్రాట్ రెడ్డితో పాటు అతడి సోదరి సాహితీ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. సీసీ టీవీ ఆధారాలను బట్టి సామ్రాట్, ఇంట్లో దొంగలించిన మాట నిజమేనని పోలీసు వర్గాల సమాచారం.