ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (09:12 IST)

అమ్మా నన్ను క్షమించు.. ఆమెరికాలో తెలుగు టెక్కీ సూసైడ్ ... భార్య వేధింపులే కారణమా?

అమెరికాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

అమెరికాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యాదగిరిగుట్ట మండలం రాళ్ళ జనగాం గ్రామానికి చెందిన గూడురు బాల్ రెడ్డి, సుగుణ దంపతుల కొడుకైన మధుకర్ రెడ్డి. చదువు కోసం 14 ఏళ్ళ క్రితమే అమెరికాకు వెళ్ళాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకొంటూ స్థిరపడిపోయాడు. ఏడేళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 
 
ప్రస్తుతం వారికి నాలుగేళ్ళ కూతురు ఉంది. మధుకర్ రెడ్డి కాలిఫోర్నియాలో స్వంత ఇల్లును కూడా కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈయన ఆత్మహత్యకు ముందు రెండుసార్లు అమ్నా నన్ను క్షమించు అంటూ రెండుసార్లు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ పెట్టాడు. 
 
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మధుకర్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆర్థికంగా మంచిస్థితిలో ఉన్న మధుకర్ రెడ్డికి ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణాలు తెలియడం లేదు. పైగా ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తినట్టు సమాచారం. దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.