శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:26 IST)

30న‌ వాచీల టెండ‌ర్ క‌మ్ వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను సెప్టెంబ‌రు 30వ‌ తేదీ టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఇందులో ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు - 37 లాట్లు ఉన్నాయి.
 
తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.     
 
అక్టోబ‌రు 1న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండ‌ర్ల‌ను టిటిడి ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు డిసెంబ‌రు - 2021 వ‌ర‌కు టిటిడి వినియోగించిన ఖాళి టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చు.
 
తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు అక్టోబ‌రు 1వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయ‌వ‌లెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.