1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:13 IST)

వివేకా హత్య కేసు.. మీడియా ప్రతినిధులకు సీబీఐ నోటీసులు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు మీడియా చానళ్లకు చెందిన ప్రతినిధులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య కేసులో వాచ్‌మన్ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. 
 
వాచ్‌మన్ రంగయ్యను పలు మీడియా చానళ్ల ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో వాచ్‌మన్ రంగయ్య ఇంటర్వ్యూలను ప్రసారం చేసిన చానళ్లను సీబీఐ గుర్తించింది. ఆయా చానళ్ల ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపింది.
 
వివేకా హత్యలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం వుందని సీబీఐ ఇది వరకే కోర్టుకు విన్నవించింది. ఉమాశంకర్ రెడ్డి వాడిన ఆయుధాల కోసం మరికొందరు నిందితుల పాత్ర తెలుసుకునేందుకు అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.