గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 20 మే 2020 (23:44 IST)

ఆంబులెన్స్ డ్రైవర్ తాళాలు లాక్కున్నారు, ఒక ప్రాణాన్ని తీసేశారు, ఎక్కడ?

తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు ఒక నిండు ప్రాణం బలైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంకటప్ప అనే పేషెంట్‌ను స్వగ్రామం రొంపిచెర్ల మండలం గానుగచింత తరలించేందుకు 8,500 రూపాయల డిమాండ్ చేశారు రుయా ఆంబులెన్స్ సిబ్బంది.
 
ధర ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఆంబులెన్స్‌ను 3,500 రూపాయలకు పిలిపించుకున్నారు పేషెంట్ కుటుంబీకులు. దీంతో ఆగ్రహంతో ప్రైవేట్ ఆంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు లాక్కున్నారు రుయా ఆంబులెన్స్ యూనియన్ డ్రైవర్లు. ఆంబులెన్స్ ఆగిపోవడంతో వెంకటప్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు.
 
రుయా ఆంబులెన్స్ మాఫియాపై రుయా సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే ఆంబులెన్స్ డ్రైవర్ల కారణంగా ఒక నిండు ప్రాణం బలికావడంతో కుటుంబ మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.