మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (13:40 IST)

ఎంఎం కీరవాణి కుమారుడికి షాకిచ్చిన ఎస్ఎస్ రాజమౌళి తనయుడు

తెలుగు చిత్రపరిశ్రమలోవున్న ప్రముఖ సెలెబ్రిటీల్లో ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళిలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి తనయులు కూడా సినీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఇపుడు మ్యూజిక్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. అలాగే రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఓ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రం పేరు ఆకాశవాణి. 
 
ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుంటే, కాలభైరవ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈయనకు సంగీత దర్శకుడుగా తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. 
 
అయితే, తాజా స‌మాచారం మేర‌కు 'ఆకాశ‌వాణి' సినిమా నిర్మాణం నుండి కార్తికేయ త‌ప్పుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకు కార‌ణం 'ఆర్ఆర్ఆర్' సినిమాయేనట. 
 
క‌రోనా వ‌ల్ల 'ట్రిబుల్ ఆర్' చిత్రీకరణ వాయిదాపడింది. ఈ సినిమా మేకింగ్‌లోనూ రాజమౌళికి కార్తికేయ సహకారం అందిస్తున్నారు. రెండు సినిమాల‌కు కార్తికేయ స‌మ‌యం కేటాయించ లేక‌పోవ‌డంతో 'ఆకాశ‌వాణి' చిత్రం నుంచి కార్తికేయ తప్పుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం.