ఆ వ్యాక్సిన్‌తో కోతుల్లో కోవిడ్ తగ్గిందట...
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కోతులపై కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేసిన పరిశోధన ఆశలు చిగురింపజేస్తోంది. కోవిడ్‌ని నియంత్రించేందుకు వారు తయారు చేసిన వ్యాక్సిన్ కోతులపై విజయవంతమైందని ప్రకటించారు. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కోతుల్లో రోగనిరోధక శక్తి కోవిడ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు.
ప్రతికూల ప్రభావాలేవీ వాటిలో కనిపించలేదని తెలిపారు. మనుషులపై ప్రయోగ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కోతుల్లో న్యుమోనియా తగ్గిపోయిందని వెల్లడించారు. అత్యంత ప్రమాదకర నావెల్ కరోనా వైరస్‌ని సైతం ఇది ఎదుర్కొందని చెప్పారు. ఒక డోసుతోనే మంచి ఫలితం కనిపించిందని వెల్లడించారు.
ఇది మనుషులపై కూడా సానుకూల ఫలితాలు కనబరుస్తుందని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌లు విశ్వాసం వ్యక్తం చేసారు. వ్యాక్సిన్ విజయవంతమైతే ఏడాది చివరికల్లా 100 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసేందుకు బ్రిటిష్ డ్రగ్ కంపెనీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.