మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By మోహన్
Last Modified: గురువారం, 14 మే 2020 (18:30 IST)

కరోనా వల్ల పెరుగుతున్న మానసిక సమస్యలు, ఎందుకంటే..?

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు అధికమౌతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళం వ్యక్తం చేసింది. అలాగే కొవిడ్-19తో పోరాడుతున్న ప్రపంచదేశాలు ఇకపై మానసిక వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని కోరింది. 
 
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, వృద్ధులు, ఒంటరిగా ఉన్నవారు, వైద్య సిబ్బంది, పోలీసులు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐరాస పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను సైతం విడుదల చేసారు. 
 
కరోనాతో పోరాటం చేయడంతో పాటు మానసిక సమస్యల పట్ల ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా సూచించింది. సొసైటీ బాగుండాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని యూఎన్ పేర్కొంది. మానసిక వ్యాధులు ఎక్కువైతే, పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చని హెచ్చరించింది.