1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (12:12 IST)

నేటితో ముగియనున్న వివేకా హత్య కేసు డెడ్‌లైన్... సర్వత్రా ఉత్కంఠ

viveka murder case
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు జూన్ 30వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తుపై సీబీఐ తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? గడువు కోరతారా? అనేదానిపై సందిగ్ధత ఏర్పడింది. 
 
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుకు వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై వచ్చే నెల  మూడో తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. నిందితుడు భాస్కర్‌రెడ్డి, ఒకరిద్దరిపై త్వరలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జులై 3న సుప్రీంకోర్టుకు కేసు దర్యాప్తు పురోగతి సీబీఐ వివరించి సమయం కోరే అవకాశముంది. 
 
బీమా డబ్బు కోసం మనిషిని చంపేశారు.. 
 
నాలుగు కోట్ల రూపాయల బీమా సొమ్ము కోసం మరో స్నేహితుడి దారుణానికి పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టాలు రావడంతో దురాలోచనకు పాల్పడ్డాడు. రూ.4 కోట్ల బీమా డబ్బును పొందడానికి తన స్నేహితుడిని చంపేసి తానే చనిపోయినట్లు భార్యతో కలసి నాటకమాడాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 
 
గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త సైన్‌పుర్‌ ప్రాంతానికి చెందిన సుఖ్‌జీత్‌ను చంపాలనే కుట్రతో అతడితో స్నేహం చేశాడు. ఈ నెల 19న గురుప్రీత్‌.. సుఖ్‌జీత్‌కు పూటుగా మద్యం తాగించాడు. అతడు మత్తులోకి జారుకున్నాక చంపేశాడు. అనంతరం మృతుడికి తన బట్టలు తొడిగాడు. తర్వాత మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ట్రక్కు కింద తొక్కించినట్లు పోలీసులు తెలిపారు. 
 
గురుప్రీత్‌ భార్య ఆ మృతదేహం తన భర్తదే అని అబద్ధమాడినట్లు పేర్కొన్నారు. గురుప్రీత్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు 20న రాజ్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురుప్రీత్‌ గత కొన్ని రోజులుగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్లు సుఖ్‌జీత్‌ భార్య పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గురుప్రీత్‌ కుటుంబ సభ్యులను మళ్లీ విచారించగా అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి గురుప్రీత్‌తో పాటు అతని భార్యను, మరో నలుగురిని అరెస్టు చేశారు.