Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అక్కడ రూ.500లకే ఎల్‌ఈడీ టీవీ..! అసలు విషయం తెలిస్తే షాకవుతారు

Written By ఎం
Updated: మంగళవారం, 2 మార్చి 2021 (10:31 IST)
ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్‌ ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషన్లు ఓ మినీ వ్యాన్‌లో లోడ్‌ చేశారు.

అయితే ఈ వ్యాన్‌పై యూపీకి చెందిన ఓ దొంగల ముఠా కన్నేసింది. ఇంకేముంది వెంటనే చాకచక్యంగా చోరీ చేసేశారు. వ్యాన్‌ను ఎవరికి అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లిపోవాలని మాస్టర్‌ ప్లాన్‌ వేశారు.

అయితే మార్గమధ్యలో కథ అడ్డం తిరిగింది. వ్యాన్‌లో డీజిల్‌ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. వ్యాన్‌లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి.

దీంతో చేసేదేమి లేక డీజిల్‌ డబ్బుల కోసం ఎల్‌ఈడీ టీవీనీ రూ.500లకు బేరం పెట్టారు. ఇలా బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం, అందించారు.

దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని పట్టుకున్నారు. చోరీ చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల విలువ రూ.9 లక్షల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకుని.. దొంగల ముఠా సమాచారం మేరకు సదరు సోనోవిజన్‌ యజమాన్యానికి సమాచారం అందించారు. 

అన్నీ చూడండి

Suriya: వీడియో గేమ్ కాన్సెప్ట్ తో సీన్ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్‌ పై సాంగ్

Rahul Sankrityan: తను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు.. అతనే రణబాలి : రాహుల్ సంకృత్యన్

Vijay Deverakonda: రశ్మిక రానందుకు సారీ - నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు వారి జీవితాలు మార్చుకోండి : విజయ్ దేవరకొండ

త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ పోస్టులు.. కాపీ క్యాట్ డైరక్టర్.. ఏకే, అజ్ఞాతవాసి, హనీ ట్రాప్ అంటూ..?

Ranabali trailer: రాయలసీమలో అణచివేతకు పోరాడే రాజవంశం కథగా రణబలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments